వైభవ్ సూర్యవంశీ నిన్న కొట్టిన సూపర్ సెంచరీకి ఇంప్రెస్ కాని వారి ఎవ్వరు ఉంటారు. 14ఏళ్ల వయస్సులో ఐపీఎల్ ఆడటమే అద్భుతం అంటే...35 బంతుల్లో సెంచరీ బాదేయటం ఇంకా పెద్ద అద్భుతం. అసలు ఆడుతున్న బౌలర్ ఎవరని చూడకుండా కొట్టాడు వైభవ్. తనకంటే డబుల్ వయస్సున్న ఇషాంత్ శర్మ ఓవర్ లో 28 పరుగులు బాదాడు వైభవ్. ఆఫ్గాన్ బౌలర్ కరీం జనత్ నైతే పాపం ఓవర్ లోనే 30 పరుగులు కొట్టాడు. సిక్స్ లు ఫోర్ ల వర్షం. ఫోర్లు కంటే ఎక్కువ సిక్సులు కొట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. 11 సిక్సులు 7 ఫోర్లు అంటే బౌండరీలతోనే 94 పరుగులు చేశాడు..అంటే 18 బాల్స్ లో 94 పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఆ ఏజ్ ఏంటీ ఈ విధ్వంసం ఏంటీ. ఫుల్ ఫిదా అందరూ. సిక్సర్ తో సూర్యవంశీ సెంచరీ కొట్టగానే గ్రౌండ్ మొత్తం మునివేళ్లపై లేచి నిలబడింది. నెలన్నరగా వీల్ ఛైర్ లోనే ఉన్న రాహుల్ ద్రవిడ్ తన కాలు బాగో లేదనే విషయం మర్చిపోయి లేచి పెద్దగా అరుస్తూ చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేశారు. సెంచరీ కొట్టగానే వైభవ్ అవుట్ అయినా అంతే గ్రౌండ్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. జైశ్వాల్ హగ్ చేసుకుంటే..గుజరాత్ ప్లేయర్లు అంతా వచ్చి వైభవ్ సూర్యవంశీని అభినందించి వెళ్లారు. అసలు గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ అనే తేడా లేదు అన్ని డగౌట్స్ లో అందరూ లేచి నిలబడి మరీ అప్రిషియేట్ చేశారు ఆ బుడ్డోడిని. వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం మరి అది.